తగ్గనున్న పెట్రోల్ ధరలు !

0
46

పెట్రోలు ధరలపై ఇటీవల కేంద్ర మంత్రి అల్ఫోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాత్రం ఊరటనిచ్చే ప్రకటన చేశారు. దివాళీ లోపు పెట్రోల్ ధరలు తగ్గుతాయని ధర్మేంద్ర తెలిపారు. అక్టోబర్ 19న దిపావళి పండుగ ఉన్నది. రోజువారీగా పెట్రోల్ ధరలు మారే పద్ధతిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే ఇవాళ అమృత్‌సర్‌ను విజిట్ చేసిన ఆయన ఇంధన ధరలు దిపావళిలోగా తగ్గుతాయని ఓ సంకేతాన్ని ఇచ్చారు. ఇటీవల జరిగిన విస్తరణలో ప్రదాన్‌కు క్యాబినెట్‌లో చోటు దక్కింది. స్కిల్ డెవలప్‌మెంట్ శాఖకు కూడా అదనపు బాధ్యతలు అందిస్తున్నారాయన. అమెరికాలో వరదలు వచ్చిన కారణంగా ఇంధన ఉత్పత్తి 13 శాతం పడిపోయిందని, దాని వల్ల ఆయిల్ ధరలు ఆకాశానంటాయన్నారు. ఆయిల్ కంపెనీలకు మార్జిన్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. పెట్రోల్‌ను కూడా జీఎస్టీలోకి తీసుకువస్తే బాగుంటుందని, దాని వల్ల కస్టమర్లకు చాలా బినిఫిట్ ఉంటుందన్నారు.

LEAVE A REPLY