తండ్రిపైనే పోరాటం.. తర్వాత తండ్రి ఆశీర్వాదం కోసం ఆరాటం

0
14

సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కి పెద్ద షాకిస్తూ ఎన్నికల సంఘం ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ని తనకి కేటాయించిన కాసేపట్లోనే యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ని కలిసేందుకు వెళ్లారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని నేతల బృందాన్నే అసలైన సమాజ్ వాది పార్టీగా పరిగణించబడుతుంది అని ఈసీ స్పష్టంచేసిన కాసేపటికే అఖిలేష్ తండ్రి ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం వెళ్లడం చర్చనియాంశమైంది.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జాతీయ కార్యవర్గం సభ్యులందరిలో మెజారిటీ మద్దతు అఖిలేష్‌కే ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 228 ఎమ్మెల్యేల్లో 205 ఎమ్మెల్యేలు, 68 ఎమ్మెల్సీల్లో 56 మంది ఎమ్మెల్సీలు, 24 మంది ఎంపీల్లో 15 మంది, 46 మంది జాతీయ కార్యవర్గం సభ్యుల్లో 28 మంది, 5731 మంది నేషనల్ కన్వెన్షన్ డెలిగేట్స్‌లో 4400 మంది మద్దతు తనవైపు అని పేర్కొంటూ అఖిలేష్ యాదవ్ ఈసీకి ఓ అఫిడవిట్ సమర్పించారు

LEAVE A REPLY