తండాలోని గిరిజనుల జీవన విధాన విశేషాలు..

0
43

వారికి వారే ఓ లక్ష్మణరేఖను గీసుకున్నారు.. ఆ గీతను దాటకుండా ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సంప్రదాయాలకు అత్యంత విలువనిస్తారు. ఆధునిక విధానాల్లో మంచిని స్వీకరిస్తారు. పెద్దలమాటంటే జవదాటరు. చెడు సహవాసాలు లేవు.. దురలవాట్లు అసలే కనిపించవు. వ్యవసాయమే జీవనాధారం.. ఒకటి, రెండేండ్లల్లో కాదు.. ఏకంగా వందేండ్ల నుంచి అదే విధానం. వారి జీవనం నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. కానీ ఇన్నేండ్లుగా వెలుగులోకిరాని వాస్తవం ఇది. ఇదెక్కడో అభివృద్ధి చెందిన నగరంలోనో కాదు.. నగరీకరణ మచ్చుకైనా తెలియని ఓ మారుమూల పల్లె సంగతి. అదీ ఓ గిరిజన తండా అంటే ఆశ్చర్యం కలుగకమానదు.

LEAVE A REPLY