-ఢిల్లీ లా కంపెనీ నుంచి రూ.13.5 కోట్ల నగదు స్వాధీనం..

0
21

దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు శనివారం రాత్రి టీ అండ్ టీ లా కంపెనీపై దాడి చేసిన కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఆ సంస్థ నుంచి రూ.13.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైం) రవీంద్రయాదవ్ ఆదివారం తెలిపారు. ఈ మొత్తంలో రూ.2.6 కోట్ల నగదు కొత్త రూ.2,000 నోట్లతో ఉన్నదని చెప్పారు. మరో రూ.7.7 కోట్లు రూ.1,000 నోట్లతో, రూ.3.06 కోట్ల మొత్తం రూ.100 నోట్లతో, రూ.11 లక్షల మొత్తం రూ.50 నోట్లతో ఉన్నదని ఆయన వెల్లడించారు. లా కంపెనీ యజమాని, ప్రముఖ న్యాయవాది రోహిత్ టాండన్ పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలింపు జరుపుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY