ఢిల్లీ ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీం ఆదేశం

0
9

పేద రోగులకు కొంత శాతం మేర ఉచితంగా వైద్యం అందించాల్సిందేనని ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘ఆసుపత్రుల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం నుంచి భూమిని చౌక ధరకు పొందుతున్నారు. సబ్సిడీలు కూడా తీసుకొంటున్నారు. కాబట్టి పేదలకు కొంత ఉచితంగా ట్రీట్‌మెంట్‌ అందజేయాలి. లీజు అగ్రిమెంట్లలో కూడా అది ఉంది. ఇన్‌పేషెంట్‌ విభాగంలో 10 శాతం, ఔట్‌ పేషెంట్‌ విభాగంలో 25 శాతం మేర ఉచితంగా పేదలకు చికిత్స చెయ్యాల్సిందే’’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

LEAVE A REPLY