ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ‘దీక్షా దివస్’

0
17

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ‘దీక్షా దివస్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్ చిత్రపటానికి ఎంపీలు కేకే, కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, సుమన్‌తో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారికి ఎంపీలు నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ దీక్ష చేపట్టి నేటికి ఏడేళ్లు అవుతోంది. 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే.
ఈ సందర్భంగా కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసిందని గర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న రాష్ట్రాన్ని అందరం కలిసి బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దీక్షకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ దీక్ష బంగారు తెలంగాణకు నాంది పలికిందన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే సీఎం కేసీఆర్ పోరాటమన్నారు. ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. రాబోయే 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటదని ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here