ఢిల్లీలో దేవుడి దర్శనం..!

0
27

ఒకప్పుడు గొప్ప ఓపెనింగ్‌ జోడీగా పేరుతెచ్చుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ రిటైర్మెంట్‌ తర్వాత సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ట్విటర్‌ వేదికగా సరదాగా పలకరించుకున్నారు. ‘ఢిల్లీలో దేవుడి దర్శనం’ అని సచిన్‌తో కలసి ఉన్న ఫొటోను సెహ్వాగ్‌ పోస్ట్‌ చేశాడు. వెంటనే స్పందించిన మాస్టర్‌ ‘అరె సెహ్వాగ్‌.. కొంచెం సేపు ఆగి ఉంటే ఈ ఫొటొనే వాడుకునే వాడిని.. నిన్ను కలవడం ఎప్పుడూ సంతోషమే’ అని రీ ట్విట్‌ చేశాడు. దీనికి ‘హహ్హా.. నాకు ఎప్పుడూ తొందరే దేవుడు గారు’ అని వీరూ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరూ ఒకరినొకరు ఆట పట్టించుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది.

LEAVE A REPLY