డ్రోన్లు, బ్యాట్ సెన్సర్లు..

0
14

చాంపియన్స్ ట్రోఫీలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇంటెల్ సహాకారంతో ఐసీసీ..అభిమానులకు కొత్త అనుభూతిని పంచబోతున్నది. ఇం టెల్ ఫాల్కన్ 8 డ్రోన్ కెమెరా సహాయంతో మ్యా చ్‌కు ముందు పిచ్ పరిస్థితిపై సమగ్రంగా వివరాలను విశ్లేషకులకు అందించనుంది. ఇందులో పిచ్‌పై గడ్డి పరిస్థితి, టోపోలజీ సమాచారముంటుంది. మరోవైపు మ్యాచ్‌లకు వేదికలైన ఓవల్, ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్‌లు వీక్షించే ప్రేక్షకులకు వర్చువల్ రియాల్టీ(వీఆర్) అనుభవాన్ని ఐసీసీ అందించనుంది. దీనికితోడు ఇంటెల్ క్యూరీ టె క్నాలజీతో బ్యాట్లలో సెన్సార్లను అమరుస్తూ బ్యాట్స్‌మెన్ ఆడే ప్రతిషాట్‌ను ఖచ్చితంగా లెక్కించనుంది. ఈ టెక్నాలజీతో బ్యాట్ వేగం, బ్యాక్ లిఫ్ట్ లాంటి వాటితో ఆటగాళ్లకు వాళ్ల షాట్లపై అవగాహన మరింత పెరుగుతుంది.

LEAVE A REPLY