డ్రైవింగ్ లైసెన్సుల ఫీజులను భారీగా పెంచుతూ

0
19

తెలంగాణ:డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిష్ర్టేషన్ల ఫీజులను భారీగా పెంచుతూ గత డిసెంబర్ 29న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాదాపు 15 ఏండ్ల తర్వాత సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989లోని రూల్ 32, 81వ నిబంధనలను సవరించింది. పెరిగిన ఫీజులను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే రాష్ట్ర రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం రూ.కోట్ల రెవెన్యూ నష్టపోయింది. రవాణాశాఖ రెవెన్యూ పెంచాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా అధికారుల అలసత్వం ఖజానాకు నష్టం తెచ్చింది. పెరిగిన ఫీజులు ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ జేటీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. తమకు కేంద్రం నుంచి సమాచారం ఆలస్యంగా అందిందని చెప్పారు.

LEAVE A REPLY