డ్రెస్సింగ్ రూంకే పరిమితం

0
17

టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీ ఇంకా గాయంతో బాధపడుతున్నాడు. తొలి రోజు ఆటలో హండ్స్‌కోంబ్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఆపే క్రమంలో కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే గాయం తీవ్రత బాగా లేకపోయినప్పటికీ పూర్తిగా నయమయ్యే వరకు మైదానంలోకి దిగద్దు అనే ఉద్దేశంతో కోహ్లీ రెండో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. ఈ కారణంగా వైస్‌కెప్టెన్ రహానే జట్టును ముందుండి నడిపించాడు. అంతకుముందు జరిగిన వామప్‌కు మాత్రం జట్టు సహచరులతో కలిసి హాజరైన విరాట్..మ్యాచ్ మొదలైన తర్వాత డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాడు. కానీ కొన్ని మార్లు బౌండరీ లైన్ దగ్గర నిలబడి సూచనలనివ్వడం కనిపించింది.

LEAVE A REPLY