డొమెస్టిక్ ఫ్లైట్‌కూ పాస్‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రి

0
43

ఇక డొమెస్టిక్ ఫ్లైట్స్‌కూ పాస్‌పోర్ట్ లేదా ఆధార్‌కార్డ్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కేంద్ర పౌర‌విమాన‌యాన‌శాఖ భావిస్తున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ నిబంధ‌న విధించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ది. దేశీయంగా ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా గుర్తింపు కోసం ఈ రెండింటిలో ఏదో ఒక‌టి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కు పాస్‌పోర్ట్ కేవ‌లం అంత‌ర్జాతీయ విమానాల్లో వెళ్ల‌డానికే త‌ప్ప‌నిస‌రిగా ఉంది. అయితే అదే ప్ర‌క్రియ‌ను దేశీయ విమానాల‌కు కూడా అమ‌లు చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ది. ఇక విమానాల్లో దుర‌సుగా ప్రవ‌ర్తించే ప్ర‌యాణికుల కోసం కొత్త నిబంధ‌న‌ల‌ను కూడా రూపొందిస్తున్న‌ది. చేసిన త‌ప్పిదం తీవ్ర‌త‌ను బ‌ట్టి నాలుగు స్థాయిల్లో శిక్ష విధించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌… ఎయిరిండియా ఉద్యోగిపై దాడి నేప‌థ్యంలో పౌర విమాన‌యాన శాఖ నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయాల‌న్న ఆలోచ‌న చేస్తున్న‌ది. సివిల్ ఏవియేష‌న్ రిక్వైర్‌మెంట్ ముసాయిదాను ప్ర‌జ‌ల ముందు ఉంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు కోరాల‌ని నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here