డైరెక్టర్ క్రిష్ ఇంట్లో ఐటీ సోదాలు

0
19

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఆడుతూ భారీ లాభాలను ఆర్జించిపెడుతోంది. ఈ నేపథ్యంలో ‘శాతకర్ణి’ నిర్మాతలు, దర్శకుడి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. కథ, స్రీన్‌ప్లే, దర్శకత్వం జాగర్లమూడి క్రిష్ అని తెలిసిందే. ఈ సినిమాకు భారీ లాభాలు వస్తున్నాయని ఐటీ అధికారులకు తెలియడంతో నిర్మాతలు, దర్శకుడి ఇళ్లలో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి మొత్తం లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY