డేవిస్ కప్ ఆడే భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌

0
30

డేవిస్ కప్ ఆడే భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ అమృత్‌రాజ్‌పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అమృత్‌రాజ్ హయాంలో జట్టులోని ఆటగాళ్లలో క్రమశిక్షణ లోపించిందని అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) భావిస్తున్నట్లు సమాచారం. దీంతో గురువారం జరిగే ఏఐటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయం వెలువడనుంది. అమృత్‌రాజ్ స్థానంలో వెటరన్ స్టార్ మహేశ్ భూపతిని జట్టు కెప్టెన్‌గా నియమించే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY