డేవిస్‌ కప్‌ నుంచి పేస్‌ అవుట్‌

0
24

వరల్డ్‌ రికార్డు కల చెదిరింది. డేవిస్‌ కప్‌లో తన హీరోచిత ఆటతో దేశానికి ఎన్నో విజయాలు అందించిన లియాండర్‌ పేస్‌పై వేటుపడింది. 1990లో భారత డేవిస్‌ కప్‌ టీమ్‌లోకి అడుగుపెట్టిన లియాండర్‌.. 27 ఏళ్లపాటు డబుల్స్‌ విభాగంలో ఎనలేని సేవలందించాడు. 55 మ్యాచ్‌ల్లో 42 విజయాలతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. మరో మ్యాచ్‌ నెగ్గితే డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ప్లేయర్‌గా లియాండర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేదే. కానీ ఆ కల చెదిరింది. శుక్రవారం నుంచి ఉజ్బెకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో పేస్‌పై వేటుపడింది. నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేష్‌ భూపతి తన తొలి ఎంపికలోనే షాకింగ్‌ నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే భూపతితో చెడిన సంబంధాల వల్లే లియాండర్‌కు చోటు దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here