డేవిస్‌కప్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌

0
25

డేవిస్‌కప్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో ఆడే భారత టెన్నిస్ జట్టు నుంచి తనను తప్పించడంపై సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న మండిపడ్డాడు. అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) ఏ ప్రాతిపదికన జట్టును ఎంపికచేస్తున్నదో వివరణ ఇవ్వాలన్నాడు.డబుల్స్ స్పెషలిస్టు లియాండర్ పేస్, ఇతనికి జోడీ గా సాకేత్ మైనేనికి చోటు కల్పించిన ఏఐటీఏ.. ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లుగా యుకీ భాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేష్ గునేశ్వరన్‌లను జట్టులోకి తీసుకుంది.
ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో పేస్ (56) క న్నా బోపన్న కు అత్యుత్తమ ర్యాంకు (28) ఉన్నా అతణ్ని ఎంపికచేయలేదు. యాడ్ కోర్టు (కోర్టుకు ఎడమవైపు నుంచి ఆడడం)లోనే ఆడతాడు, డ్యూస్ కోర్టు (కోర్టుకు కుడివైపు నుంచి ఆడడం)లో ఆడడన్న సాంకేతిక కారణం చూపి తనపై వేటు వేయడమేంటో అర్థంకావడం లేదన్నాడు.

LEAVE A REPLY