డేగలకు ‘రాజభోగం’!

0
21

రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవ ఉంటుందో? ఉండదో? కానీ మనుసు పడితే మాత్రం దేనికైనా రాజభోగం పడుతుందని నిరూపించారు సౌదీ యువరాజు. తన డేగలు ప్రయాణించడం కోసం ఏకంగా 80 సాధారణ విమాన టికెట్లను కొనుగోలు చేశారు.

అవి ప్రయాణికులతోపాటే దర్జాగా ప్రయాణించాయి. అయితే, డేగల కండ్లకు గంతలు, అవి ఎటూ కదలకుండా వాటి కాళ్లను సీట్లకు కట్టారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. డేగ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) జాతీయ పక్షి. మధ్య ఆసియా దేశాల్లో వీటిని సాధారణ విమానాల్లో తీసుకెళ్లడం అరుదైన విషయమేమీ కాదు. విమానాల్లో ప్రయాణించడానికి డేగలకు గ్రీన్ పాస్‌పోర్టులు కూడా ఉంటాయి. ఆ పాస్‌పోర్టులతో బహ్రెయిన్, కువైట్, ఒమన్, కతార్, సౌదీ అరేబియా, మొరాకో, సిరియా తదితర దేశాల్లో ప్రయాణించడానికి అనుమతి ఇస్తారు.

 

LEAVE A REPLY