డిసెంబర్ 9న ‘ధృవ’

0
30

రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ధృవ. సురేందర్‌రెడ్డి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సెన్సార్ పూర్తయింది. యు.ఎ.సర్టిఫికెట్ లభించింది. డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మెడికల్ మాఫియాను నడుపుతున్న అరాచక శక్తులపై నిజాయితీ పోలీస్ అధికారి పోరాటమేమిటన్నదే చిత్ర ఇతివృత్తం అన్నారు. అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.యస్.వినోద్, సంగీతం: హిప్‌హాప్ ఆది, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై.ప్రవీణ్‌కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here