డిజెఒ గ్లోబల్‌తో సండోర్‌ ఆర్థోపెడిక్స్‌ ఒప్పందం

0
23

ఆర్థోపెడిక్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సండోర్‌ గ్రూప్‌ సంస్థ సండోర్‌ ఆర్థోపెడిక్స్‌.. అమెరికాకు చెందిన డిజెఒ గ్లోబల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు డిజెఒ గ్లోబల్‌కు చెందిన డాన్‌జాయ్‌, ఎయిర్‌కాస్ట్‌ శ్రేణి ఆర్థోపెడిక్‌ ఉత్పత్తులను (మణికట్టు, మోకాళ్లకు వాడే బ్రేసెస్‌ వంటివి) భారత, సార్క్‌ దేశాల్లో సండోర్‌ ఆర్థోపెడిక్స్‌ మార్కెటింగ్‌ చేయనుంది. తమ ఆర్థోపెడిక్‌ ఉత్పత్తు ల్లో నాణ్యత అధికంగా ఉండటం వల్ల అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతోందని, భారతలోనూ వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సండోర్‌ ఆర్థోపెడిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు డిజెఒ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) స్టీఫెన్‌ జె ముర్ఫి గురువారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ ఉత్పత్తులకు భారతలో డిమాండ్‌ పెరిగితే ఇక్కడే సండోర్‌తో కలిసి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భారతలో ఆర్థోపెడిక్‌ బ్రేసెస్‌ మార్కెట్‌ పరిమాణం 300 కోట్ల రూపాయల వరకు ఉందని చెప్పారు. భారతలో వృద్ధులతోపాటు యువకులు కూడా ఆర్థోపెడిక్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, డిజెఒ గ్లోబల్‌ ఉత్పత్తుల ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని సండోర్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సింధీ తెలిపారు.

LEAVE A REPLY