డిజిటల్ లావాదేవీలపై సేవాపన్ను రద్దు’

0
21

డెబిట్ కార్డు లావాదేవీలపై డిసెంబర్ 31వ తేదీ వరకు సేవాపన్నును రద్దు చేస్తున్నట్లు ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నేడు మీడియా ద్వారా మాట్లాడుతూ.. డిజిటల్ లావాదేవీల వినియోగంపై డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వ బ్యాంకులు చెబుతున్నాయన్నారు. దీంతో డెబిట్ కార్డులపై సర్వీస్ ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఈ-వ్యాలెట్లు నగదు పరిమితిని ఆర్‌బీఐ పెంచిందన్నారు. ఆన్‌లైన్ రైల్వే టికెట్లపై డిసెంబర్ 31 వరకు సేవా పన్ను రద్దు చేసినట్లు చెప్పారు.

రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఆయన నాబార్డ్ ద్వారా ఇప్పటికే సహకార బ్యాంకులకు రూ. 21 వేల కోట్లను పంపించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 82 వేల ఏటీఎంలలో నగదు అందుబాటులోకి తెచ్చామన్నారు. మిగతా ఏటీఎంలలో అతి త్వరలోనే నగదు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా లక్షా 55 వేల పోస్టాఫీసుల్లో కొత్తనోట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY