డబ్బు చెల్లించే సమయంలో మీ ఆధార్ నంబర్

0
26

తెలంగాణ:డిజిటల్ చెల్లింపులు చేయాలంటే? స్వైప్ మిషన్‌లో కార్డు ఉపయోగించాలి. లేదంటే రూపే, పేటీఎం తదితర యాప్స్ వాడాలి.. ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయాలి. వీటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉండాలి.. లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా కావాలి! మరి ఇవి లేనివారి పరిస్థితేంటి? ఉన్నా వాడగలిగే పరిజ్ఞానం లేనివారి సంగతేంటి? అరకొర ఆన్‌లైన్ జ్ఞానంతో చేతులు కాల్చుకునేవారికి మార్గమేంటి? వీటన్నింటికీ పరిష్కారాలు చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సులభమైన పద్ధతుల్లో ఆన్‌లైన్ చెల్లింపులకు కసరత్తు చేస్తున్నది. అదే ఆధార్ యాప్! నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రజలకు మెరుగైన, సులభమైన పద్ధతుల్లో డిజిటల్ చెల్లింపులకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆధార్ అనుసంధాన విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నదని సమాచారం. ఆధార్ నంబర్ చెప్పి.. వేలి ముద్ర వేయడంతో లావాదేవీ పూర్తయ్యే పద్ధతుల్లో ఈ కొత్త విధానం ఉండబోతున్నది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర భారీ నీటిపారుదల, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు రెండు దఫాలుగా చర్చలు జరిపారు.

LEAVE A REPLY