డబుల్ బెడ్‌రూం ఇండ్లపై కేంద్రమంత్రి ప్రశంస

0
23

మర్కుక్ మండలం ఎర్రవల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేంద్రమంత్రి విజయ్ గోయల్ పరిశీలించారు. కేంద్రమంత్రికి ఎర్రవల్లి సర్పంచ్ ఘనంగా స్వాగతం పలికారు. ఇండ్ల నిర్మాణం అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వడంపై గోయల్ ఆనందం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం పథకం దేశానికే ఆదర్శమన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం ఎంతో గొప్పదని కితాబిచ్చారు. పేద ప్రజల కోసం ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గది అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని కొనియాడారు.

LEAVE A REPLY