ఠాణాలో ఏడేండ్ల బాలిక ఆత్మాహుతిదాడి

0
25

పేలుడు పదార్థాలు ఉన్న బెల్ట్‌ను ధరించిన ఏడేళ్ల బాలిక పోలీసుస్టేషన్‌లోకి తాపీగా నడుచుకుంటూ వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడటం సంచలనం రేపింది. డమస్కస్‌లోని మిడాన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకొన్న ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. బాత్రూంను ఉపయోగించుకొంటానని బాలిక అడిగింది. అందుకు అధికారులు అనుమతించడంతో పోలీస్‌స్టేషన్‌లోనికి వెళ్లింది. ఆ తర్వాత పేలుడు పదార్థాలున్న బెల్ట్‌ను పేల్చుకున్నది అని పోలీసులు తెలిపారు. రాకెట్లు, మోర్టార్లతో దాడులకు యత్నించే ఉగ్రవాదులు తాజాగా ఓ బాలికను ఆత్మాహుతిదాడికి ఉపయోగించడం సంచలనంగా మారింది.

LEAVE A REPLY