ట్రైలర్‌ నచ్చితేనే సినిమా చూస్తా

0
21

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది సోనాక్షి సిన్హా. కెరీర్‌ మొదట్లో చబ్బీ పాత్రల్లో నటించినా.. తర్వాత యాక్షన్‌.. మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. అయితే.. కెరీర్‌లో ఇలా ఛాలెంజింగ్‌ పాత్రలు ఎంచుకోవడంలో తనపై ఎవరి ఒత్తిడి లేదంటోంది.

‘‘ ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రల్లోనే నటించాలని అనుకుంటా. అందువల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. గతంలో నేను చేసిన పాత్రల గురించి ఎప్పుడూ చింతించను. నాకంటూ ఏర్పరచుకున్న కొన్ని షరతులకు లోబడి పాత్రలను ఎంచుకుంటా. అంతేతప్ప ఎవరి బలవంతంపైనా ఒప్పుకోను. ఒత్తిడి పెంచుకోను.’’ అని చెప్పుకొచ్చింది సోనాక్షి సిన్హా.

‘‘ విభిన్న చిత్రాలు చూడటమంటే నాకిష్టం. యాక్షన్‌, కామెడీ చిత్రాలను బాగా ఎంజాయ్‌ చేస్తా. ఎప్పుడూ సినిమాని ఓ నటిగా.. సినిమాలకు సంబంధం ఉన్న వ్యక్తిలా కాకుండా ఓ సగటు ప్రేక్షకురాలిగానే చూస్తుంటా. ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉంటేనే సినిమా చూస్తా. లేదంటే లేదు.’’ అని చెప్పింది సోనాక్షి.

LEAVE A REPLY