ట్రెండ్‌ మార్చిన సియాన్‌

0
22
గత కొంత కాలంగా విభిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన సియాన్‌ విక్రం ట్రెండ్‌ మార్చాడు. సేతు, కాశి, పితామగన్‌, అన్నియన్‌ అంటూ పలు చిత్రాలలో విభిన్న పాత్రల్లో నటించిన విక్రం తమిళ సినిమాలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తర్వాత ఎంతటి రిస్క్‌ అయినా ఎదుర్కొని నటించగలడని పేరు పొందాడు. అయినప్పటికీ ఇటీవల విక్రం సామర్థ్యానికి తగిన పాత్రలు ఆయనకు లభించలేదు. దీంతో యువ హీరోల బాణికి మారాడు విక్రం. ప్రస్తుతం విజయచందర్‌ దర్శకత్వంలో పేరు ఖరారు కాని ఉత్తర చెన్నై వాసిగా నటిస్తున్న విక్రం, ఆ చిత్రంలో యాక్షన్‌ హీరోగా నటిస్తున్నాడు. గతంలో చరణ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన జెమిని చిత్రం వంటి గెటప్‌లో నటిస్తున్న విక్రంకు ఇందులో అభిమానులను ఉర్రూతలూగించే పాట ఉందట. అందువలన జెమిని చిత్రంలోని ‘ఓ పోడు’ పాట వంటి పాట ఉంటే బాగుంటుందని విక్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దీంతో అటువంటి పాట కోసం తంటాలు పడుతున్నాడు ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్‌.

LEAVE A REPLY