ట్రక్ బాంబు పేలి 90మంది మృతి

0
18

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారత్, జర్మనీ దౌత్యకార్యాలయాలకు అతిసమీపంలో బుధవారం ఉదయం భారీ బాంబు పేలుడు సంభవించిం ది. కాబూల్ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటనలో 90మంది మృతిచెందారు. 400మందికి పైగా గాయపడ్డారు. జాన్‌బాక్ స్కేర్‌లో జాతీయ రక్షణశాఖ డైరెక్టరేట్ (ఎన్‌డీఎస్) ప్రధాన కార్యాలయం ఎదురుగా బాంబులతో నిండిన ట్రక్కును ఓ మానవబాంబు పేల్చివేయడం ఈ విధ్వంసానికి కారణమైంది. శక్తిమంతమైన ఈ బాంబు పేలుడు కారణంగా వందమీటర్ల పరిధిలో ఉన్న భవనాల కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో దట్టమైన నల్లటిపొగ కమ్ముకుంది. భయకంపితులైన స్థానికులు తేరుకునేసరికే, భారీ సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. తెగిపడిన అవయవాలు, తునాతునకలైన కార్లతో ప్రమాదస్థలం భీతావహంగా మారింది.పేలుడు శబ్దం విన్న నగరవాసులు భూకంపం వచ్చిందేమోనని భావించారు.

LEAVE A REPLY