ట్రంప్.. అయితే ఏంటి?

0
36
తమకు అమెరికా అధ్యక్షుడైనా, సామాన్య పౌరుడైనా ఒకటేనని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తేల్చి చెప్పింది. హింసాత్మక బెదిరింపులు, వేధింపులు, అసభ్యకర దూషణలు, విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలను తమ ఖాతాల్లో పోస్టు చేస్తే అది ఎవరైనా సరే వారి అకౌంట్‌ను బ్యాన్ చేస్తామని ట్విట్టర్ పేర్కొంది. అలా చేయడం తమ పాలసీని ఉల్లంఘించడమే అవుతుందని, కాబట్టి బ్యాన్ చేయక తప్పదని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. ఈ విషయం అన్ని అకౌంట్లకు వర్తిస్తుందని పేర్కొన్న ఆయన వెరిఫైడ్ అకౌంట్లకు కూడా ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.

LEAVE A REPLY