ట్రంపే ‘ఈ ఏటి మేటి వ్యక్తి’-ప్రకటించిన టైమ్‌ సంపాదకులు

0
30

న్యూయార్క్‌: అమెరికా తదుపరి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను.. ‘ఈ ఏటి మేటి వ్యక్తి’గా ప్రముఖ వార్తా సంస్థ టైమ్‌ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయానికిగాను ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. అయితే ఆయన్ను ‘విభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు’గా అభివర్ణించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, డెమోక్రటిక్‌ నేత హిల్లరీ క్లింటన్‌ సహా ప్రపంచ ప్రముఖుల పేర్లను పరిశీలించిన అనంతరం.. టైమ్‌ సంపాదకులు బుధవారం ట్రంప్‌వైపు మొగ్గుచూపారు. దీంతో ‘టైమ్‌ ఈ ఏటి మేటి వ్యక్తి సంచిక-2016’ ముఖచిత్రంపై ట్రంప్‌ చిత్రం ఖరారైంది. అయితే ట్రంప్‌ ఫోటో కింద ‘విభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు’అని రాస్తామని టైమ్‌ స్పష్టంచేసింది. ఈ సర్వేలో విజయం సాధించడంపై ట్రంప్‌ సంతోషం వ్యక్తంచేశారు. దేశాన్ని విభజించేలా తాను ఏ పనీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ సర్వేలో రెండో స్థానం హిల్లరీకి దక్కింది. టైమ్‌ ఎంపిక చేసిన తుది జాబితాలో మోదీ పేరున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here