ట్యాంకర్‌ నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌

0
16

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ నుంచి ఆక్సిజన్‌ లీకైంది. ఆక్సిజన్‌ భారీగా లీకై జాతీయ రహదారి అంతా వ్యాపించింది. సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది, విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు రాకుండా నీళ్లు చల్లుతున్నారు. గన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. టెక్నికల్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని లీకేజీని ఆపే ప్రయత్నం చేస్తున్నారు.

LEAVE A REPLY