టైటిల్ ఫెవరేట్లుగా భారత్,

0
14

టోర్నీ టైటిల్ ఫెవరేట్లలో భారత్ ఒకటి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమ్‌ఇండియా టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. గత ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండోసారి కప్‌ను ఒడిసిపట్టుకోవాలనే తలంపుతో ఉన్నది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాచ్‌ల్లో విజయాలతో మంచి ఊపుమీదున్న కోహ్లీసేన..దాయాది పాకిస్థాన్‌తో పోరుతో టోర్నీకి ఆరంభం పలుకనుంది. బ్యాటింగ్ పరంగా చూస్తే ఓపెనర్ ధవన్, దినేశ్ కార్తీక్, కెప్టెన్ కోహ్లీ మంచి టచ్‌లో ఉండగా, ధోనీ, రోహిత్‌శర్మ, కేదార్‌జాదవ్, యువరాజ్‌సింగ్ బ్యాటు ఝులిపిస్తే తిరుగుండకపోవచ్చు. పేస్ బెంచ్ షమీ, భువనేశ్వర్, ఉమేశ్, బుమ్రా రాణిస్తే..ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవు. అయితే కోచ్ కుంబ్లేతో నెలకొన్న విభేదాలు జట్టు ప్రదర్శనపై ఒకింత ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తున్నది.

LEAVE A REPLY