టీ సర్కార్ కు గుదిబండగా మారబోతున్న భూ ప్రక్షాళన..

0
6

సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. భూప్రక్షాళన పేరుతో ఆమద్య నిర్వహించిన సర్వే అంతా రైతు శ్రేయస్సుకు అనుకూలంగా జరిగిందని, ఇక ప్రభుత్వ పరంగా తెలంగాణలో రైతులకు పూర్తి న్యాయం జరుగుతుందని కేసీఆర్ ఆకాంక్షిచారు. అదే అదనుగా అదికారులపై పెద్ద ఎత్తున భరోసా ఉంచారు. ఆ నమ్మకమే కొంపముంచే పరిస్థితికి తీసుకొచ్చింది. ఏ రైతుకు ఎంత భూమి ఉందో నిర్ధారించే ప్రక్రియ దేవుడెరుగు.. ఉన్న భూమిని రికార్డులనుండి తొలగించే పరిస్తితులు తలెత్తాయని రైతలు గొల్లు మంటున్నారు. అదికారుల తప్పిదాల వల్ల , యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి వల్ల భూప్రక్షాళన ప్రక్రియ అధ్వాన్నంగా తయారయ్యిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విమర్శలు రాను రాను అస్త్రాలుగా మారి ప్రభుత్వాన్ని గురి చూసే ప్రమాదం పొంచి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భూ ప్రక్షాళన విధానంలో లోపాలు..
భూ ప్రక్షాళన విధానంలో లోపాలు..అదికారల నిలువెత్తు నిర్లక్ష్యం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసికుడు ! అయితే, ఆయన చేసే సాహసాలన్నీ సర్కస్ ఫీట్లను తలపిస్తుంటాయి. సీరియస్ గా జరగాల్సిన విషయాలు కూడా కామెడీగా మారిపోతుంటాయి. ఆదేశాలైతే గొప్పగా జారీ చేస్తారు… అమలు దానంతట అదే జరిగిపోతుందని అనుకుంటారయన. అంతే కాదు… తన ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో అద్భుతాలు జరిగిపోతున్నాయని భ్రమిస్తుంటారు. అందుకే కిందేం జరుగుతుందో లోతుల్లోకి వెళ్లి చూసే ప్రయత్నం చేయరు. కేసీఆర్ ఘనంగా చెప్పుకునే భూ రికార్డుల శుద్ధీకరణ విషయం ఇదే కోవలోకి వస్తుంది. తాను వేసిన ఆర్డర్ తో ఒక్క దెబ్బకు రాష్ట్రంలో భూములన్నీ ప్రక్షాళన అయిపోయాయని ఆయన సంబరపడుతున్నారు.

తల పట్టుకుంటున్న భూస్వాములు..
తప్పుల తడకగా భూరికార్డులు… తల పట్టుకుంటున్న భూస్వాములు..

భూమి లెక్కలన్నీ ఇక పక్కా అని నమ్మబలుకుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు ప్రధాన పత్రికల్లో ఆధారాలతో వార్తలు వస్తున్నాయి. భూ రికార్డులన్నీ తప్పుల తడకగా మారాయని చెబుతున్నారు. శుద్ధీకరణలో అనేక దోషాలు దొర్లాయంటున్నారు. ఒకరి భూమి మరొకరి ఖాతాలో చేరిన ఉదంతాలు ఉన్నాయట. ఉన్న భూమికంటే తక్కువ, ఎక్కువ లెక్కలు తేల్చారట. వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్టు కొత్త రికార్డుల్లో చూపారు. కొనుగోలు చేసిన భూమికి అనువంశికంగా సంక్రమించినట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here