టీడీపీలోకి ఉప్పులేటి కల్పన?

0
32

వైసీపీలో మరో వికెట్‌ పడనుంది. ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత, కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నేతలతో ఆమె సంప్రదింపుల్లో ఉన్నారని, కొద్ది రోజుల్లో లాంఛనంగా ఆ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా పామర్రు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, శ్రేణులను సన్నద్ధం చేసే పనిని అధినాయకత్వం ఇప్పటికే చేపట్టింది. గత ఎన్నికల్లో కల్పనపై పోటీ చేసి, ఓడిపోయిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ వర్ల రామయ్యతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దీనిపై చర్చించినట్లు చెబుతున్నారు. వైసీపీలో చేరి, గత ఎన్నికల్లో పామర్రు నుంచి పోటీచేసి కల్పన గెలిచారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఆమె పాత్ర పరిమితంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో జరిగిన చర్చలు ఆ పార్టీ దిశగా అడుగులు పడేలా చేశాయంటున్నారు.

LEAVE A REPLY