టీఎస్ పాలిసెట్ -2017 ఫలితాలు విడుదల

0
27

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ పాలిసెట్-2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 22న జరిగిన పాలిసెట్‌కు 1,28,107 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 1,09,058 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 43,436, మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 65,622 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం www.ntnews.com, www.ntnipuna.com వెబ్‌సైట్‌లను లాగిన్ అవొచ్చు. పాలిసెట్ కౌన్సెలింగ్ ను మే 3వ వారంలో నిర్వహించబడును.

LEAVE A REPLY