టీఎస్సార్ విజన్-2020

0
11

టీఎస్ఆర్ తన పొలిటికల్ ఫ్యూచర్ మీద క్లారిటీ ఇచ్చేశారు. విశాఖ సీటు కోసం తాను పార్టీ మారబోతున్నానన్న వార్తల్ని కొట్టిపారేశారు. ఇన్నేళ్లు తాను నమ్ముకుని వున్న కాంగ్రెస్ పార్టీకి ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదు కనుక.. వైసీపీలో చేరి.. కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతారంటూ సుబ్బిరామిరెడ్డి మీద ఇటీవల వార్తలొచ్చాయి. కానీ.. తాను వైసీపీలో చేరే ప్రసక్తే లేదంటూ ఆయన తేల్చిచెప్పేశారు

విశాఖపట్నంలో మీడయాతో మాట్లాడిన టీఎస్సార్.. జగన్ తో ఈ దిశగా మంతనాలు జరుపుతున్నానన్న వార్తల్ని తోసిపుచ్చారు. దీంతో.. ఆయన పొలిటికల్ జర్నీపై కొత్త సందేహాలకు తావిచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎస్సార్ సభ్యత్వం.. ఏప్రిల్ 2020 వరకు కొనసాగనుంది.

LEAVE A REPLY