టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్

0
40

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మహేష్‌బాబుకు అభిమానులున్నారు. అయితే భాషతో సంబంధం లేకుండా మహేష్‌ను అభిమానించే వారున్నారని నిరూపించే సంఘటన ఇది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబును కలిసేందుకు గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయ్ పటేల్ ఫ్యామిలీతో సహా రావడం విశేషం. రావడమే కాదు మహేష్‌తో ఫోటోలు కూడా దిగారు. షూటింగ్ జరుగుతున్న తీరును దర్శకుడు మురుగదాస్‌ను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్‌లో కూడా మహేష్‌కు ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY