టాలీవుడ్‌లో ఫామిలీ సినిమాల హీరోగా ఏలినంత కాలం ఏలుకుని

0
21

జగపతిబాబుకు ఆకలి తీరినట్లు లేదు. టాలీవుడ్‌లో ఫామిలీ సినిమాల హీరోగా ఏలినంత కాలం ఏలుకుని.. ఆ తర్వాత తెల్లగడ్డం పెంచి విలన్‌గా సెటిలయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా సౌతిండియాలో అన్ని మూలల నుంచీ ఖల్‌నాయక్ వేషాల్ని కొల్లగొడుతున్నా.. ఆయన ఆకలి తీరినట్లు లేదు. ఇప్పుడు జగపతి బాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ‘భైరవ’. ఈ తమిళ్ మూవీలో విజయ్ హీరో.
ఇప్పటికే బోలెడంత స్టార్‌డమ్ సొంతం చేసుకుని.. ఫుల్ స్వింగ్ లో వున్న విజయ్‌కి ఈ భైరవ మూవీ మరిన్ని మార్కులు వేసింది. ఈనెల 12న రిలీజైన ‘భైరవ’లో పద్ధతైన విలన్ వేషం వేసిన జగపతిబాబును కూడా తమిళ సినీజనం మెచ్చుకుంటున్నారు. కానీ.. ‘భైరవ’ వసూళ్ల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. ‘భైరవ’ కనుక బ్లాక్‌బస్టర్ అయితే.. కోలీవుడ్‌లో తనకు మరో మూడునాలుగేళ్ల పాటు ఢోకా లేదన్నది జగ్గూ ఒపీనియన్. అలాగని ఇప్పుడు తానేమీ ఖాళీగా లేరు కూడా. తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో ఈ బాబు బాగా బిజీ. తమిళంలోనే కాస్త డౌన్ ట్రెండ్ నడుస్తోంది.

LEAVE A REPLY