టాప్‌-12లో 6 నియోజకవర్గాలు ఆ జిల్లావే

0
30

పశ్చిమగోదావరి జిల్లా.. నవ్యాంధ్రలో అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. పంటలు, చేపల పెంపకం, తోటల పెంపకం, పశు సంవర్థకం తదితర అంశాల్లో స్థూల ఉత్పత్తిలో దూసుకుపోతున్న ఆ జిల్లా కేవలం ఆర్థికంగానే గాక.. సామాజిక అవసరాలు, మౌలిక వసతుల కల్పనలోనూ పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. వాటి సామర్థ్యాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఆఽధారంగా ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ఇందులో మొదటి 12 ర్యాంకుల్లో 6 ర్యాంకులను పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 నియోజకవర్గాలు కైవసం చేసుకున్నాయి. అందులోనూ తొలి 4 ర్యాంకులను ఆ జిల్లా నియోజకవర్గాలే సాధించాయి. చివరి 12 నియోజకవర్గాల్లో వెనుకబడిన జిల్లాలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధిని కేవలం స్థూల ఉత్పత్తి విలువతో మాత్రమే లెక్కించలేమని, ఆర్థిక అంశాలతో పాటు సామాజికాంశాల్లోనూ మెరుగుపడితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమనే కోణంలో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించి ర్యాంకులు ప్రకటించింది. ఆర్థిక, సామాజిక అంశాల్లో సమతౌల్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మొత్తం 14 అంశాలను అభివృద్ధికి ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఆ అంశాలివీ.. 1)స్థూల ఉత్పత్తి విలువ; 2)తలసరి ఆదాయం; 3)తలసరి విద్యుత వినియోగం; 4)గృహాలకు నల్లాల కనెక్షన్లు; 5)ఓడీఎఫ్‌ ప్రకటిత గ్రామ పంచాయతీలు; 6)నీరు-ప్రగతితో అదనంగా సాగులోకొచ్చిన భూమి విస్తీర్ణం; 7)చదువుకు దూరంగా ఉన్న పిల్లల సంఖ్య; 8)శిశు మరణాలు; 9)మాతా మరణాలు; 10)‘మీకోసం’ సమస్యల పరిష్కారం శాతం; 11)పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధినులు; 12) ఎన్టీఆర్‌ వైద్యసేవ అమలు తీరు; 13) ఎన్టీఆర్‌ పింఛన్లు; 14)రోడ్ల నిర్మాణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here