టర్కీలో రష్యా రాయబారి హత్య

0
25

:టర్కీలో రష్యా రాయబారి హత్యను భారత్, అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఆ ఘాతుక చర్య దిగ్భ్రాంతిని కలిగించిందని, టెర్రరిజాన్ని ఏవిధంగానూ సమర్థించడం కుదరదని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టర్కీలో రష్యా రాయబారిని హత్య చేయడం దారుణం. ఆ దారుణ ఘటన విషాదాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది. రాయబారి ఆంద్రెయ్ కార్లోవ్ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని విదేశాంగశాఖ పేర్కొన్నది. ఇదిలాఉండగా అంకారాలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో టర్కీలోని తమ దౌత్య కార్యాలయాలు అన్నింటిని మూసివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

LEAVE A REPLY