జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ట్రంప్ సీరియ‌స్ వార్నింగ్‌

0
22

జ‌ర్న‌లిస్ట్‌ల‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. భూమి మీద నిజాయితీ లేని వ్య‌క్తుల్లో జ‌ర్న‌లిస్టులే ముందుంటార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌స్తుతం మీడియాతో యుద్ధం చేస్తున్నాన‌ని, త‌న ప్ర‌మాణ‌స్వీకారానికి చాలా త‌క్కువ మంది వ‌చ్చార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌ మీడియా త‌గిన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సిందేన‌ని హెచ్చ‌రించారు. నా ప్రమాణ‌స్వీకారానికి భారీగా ప్ర‌జ‌లు వ‌చ్చారు. ఆ ఫీల్డ్ మొత్తం జ‌నంతో నిండిపోయింది. కానీ టీవీలో ఓ చానెల్ చూస్తే గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉన్న‌ట్లు చూపించారు అని ట్రంప్ వెల్ల‌డించారు. నేను ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో ప‌ది, ప‌దిన్న‌ర ల‌క్ష‌ల మంది వ‌చ్చిన‌ట్లు నాకు అనిపించింది. కానీ ఎవ‌రూ లేని చోటును మాత్ర‌మే ఆ టీవీ వాళ్లు చూపించారు. కానీ జ‌నం వెల్లువ‌లా వ‌చ్చారు. వ‌ర్షం ప‌డుతుంద‌న్న భ‌యం ఉన్నా.. నా ప్ర‌సంగ స‌మ‌యానికి దేవుడు క‌రుణించి వ‌ర్షం కురిపించ‌లేదు అని ట్రంప్ అన్నారు.

LEAVE A REPLY