జై లవ కుశ’ ట్రైలర్.. తారక్ నట విశ్వరూపం

0
112

ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు ముందుగా చెప్పినట్లు ‘జై లవ కుశ’ ట్రైలర్‌ని ఈరోజు (10-09-2017) సాయంత్రం విడుదల చేశారు. ఇందులో స్టోరీలైన్‌ని ఏమాత్రం రివీల్ చేయలేదు కానీ.. తారక్ చేసిన మూడు పాత్రలతో నింపేశారు. మొదట్లో ‘కుశ’ చేసే తుంటరి పనులు, ‘లవ’ అమాయకత్వంతోపాటు అతనిలో దాగివున్న చిలిపితనాన్ని, ఆ తర్వాత సగం వీడియోని ‘జై’ పాత్రని చూపించారు. కుశ, లవ పాత్రల్ని సెటిల్డ్‌గా చూపించగా.. ‘జై’ క్యారెక్టర్‌ని వైల్డ్‌గా ప్రెజెంట్ చేశారు. దీన్ని బట్టి.. ఆ పాత్రే ఈ చిత్రంలో కీలకం అని అనిపిస్తోంది. ఇక ఈ మూడు పాత్రల్లో తారక్ పరకాయ ప్రవేశం చేసేసి.. మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇకపోతే.. ఇద్దరు హీరోయిన్లు రాశీఖన్నా, నివేదా థామస్‌లతోపాటు హంసానందిని, నందితా ఇలా కనిపించి అలా మాయమైపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here