జూనియర్ అతిలోక సుందరి.. దించేసిందిలే!

0
28
మనుషుల్ని పోలిన మనుషులు భూమిపై ఏడుగురు ఉంటారంటారు. కొన్ని కొన్ని సంఘటనలను చూస్తే అది నిజమే అనిపిస్తుంటుంది. కొన్ని నెలల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు లాగానే ఉన్న ఓ వ్యక్తిని చంద్రబాబు కలిశారు. వారిద్దరూ పక్క..పక్కన నిలబడితే ఎవరు..ఎవరో గుర్తుపట్టడం కొంచెం కష్టమే. తాజాగా జూనియర్ అతిలోక సుందరి వీడియో యూట్యూబ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. అచ్చుగుద్దినట్టు శ్రీదేవి పోలికలతో ఉంది ఓ నెలల చిన్నారి. ఆ చిన్నారి మోములో హావభావాలు, కళ్లు, ముక్కు సహా.. చిన్నప్పుడు శ్రీదేవి ఎలా ఉందో.. చిన్నప్పుడేంటి ఇప్పుడు శ్రీదేవి ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ జూనియర్ శ్రీదేవి వీడియో నెట్‌లో వైరల్ అయ్యింది. ఆనాడు అందం, నటనతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన శ్రీదేవి కంట ఆ వీడియో బహుశా పడి ఉండదు. ఆ చిన్నారిని చూస్తే శ్రీదేవి కూడా మురిసిపోతుందేమో మరి. అయితే.. ఆ పాప ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతానికి అదైతే సస్పెన్సే.
         వీడియోపై నెటిజన్ల కామెంట్లు కొంత ఆశ్చర్యం కలిగించక మానదు. చిన్నారుల ఫొటోలు, వీడియోలు దయచేసి నెట్‌లో పెట్టొద్దని, అది వారికే ప్రమాదమని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. వీడియోలో పాప భయంతో ఏడుస్తుండడంతో.. పాపను అలా భయపెట్టి వీడియో ఎందుకు తీస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆ వీడియో లైటింగ్‌కు పాప కళ్లు నొప్పి పెడతాయని, అలా చేయొద్దని సూచనలు చేశారు. మరి, వారి కామెంట్లలోనూ నిజం లేకపోలేదు. ఇక, అచ్చం శ్రీదేవిలాగానే ఉందంటూ ఆ పాపాయిని గారాం చేసేశారు నెటిజన్లు. నెక్ట్స్ శ్రీదేవి అంటూ కామెంట్లు పోస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here