జుత్తు పెంచి.. గిన్నిస్‌లో చోటు సంపాదించి..

0
35

అమెరికాకు చెందిన 13 ఏండ్ల బాలుడు గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించాడు. అతడు పెంచుకున్న వెంట్రుకలు ఈ గుర్తింపును తెచ్చిపెట్టాయి. పురుష విభాగంలో టైలర్ వ్రైట్ అనే బాలుడి జుట్టు 25.4సెంటీమీటర్ల ఎత్తు, 22.9 సెంటీమీటర్ల వెడల్పు, 177సెంటీమీటర్ల చుట్టుకొలతతో ఉన్నది. దీంతో అతడు గత రికార్డును బద్ధలుకొట్టాడు. గతంలో ఈ రికార్డు 14.6 సెంటీమీటర్ల ఎత్తు, 21.6 సెంటీమీటర్ల వెడల్పు, 154.3సెంటీమీటర్ల చుట్టుకొలతతో ఉండేది. ఇంత చిన్న వయస్సులో గిన్నిస్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉన్నదని టైలర్ వ్రైట్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here