జీహెచ్‌ఎంసీ కార్మికులకు హెల్త్ కార్డులు

0
68

త్వరలోనే జీహెచ్‌ఎంసీ కార్మికులకు హెల్త్ కార్డులు జారీచేస్తామని జిహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు గుర్తింపు సంఘం జీహెచ్‌ఎంఈయు అధ్యక్షులు యు. గోపాల్ తెలిపారు. హెల్త్‌కార్డుల జారీతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఎన్‌ఎంఆర్‌లను పర్మినెంటు చేయాలని కోరుతూ తాము కమిషనర్‌కు వినతిపత్రం సమ ర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, ఎన్‌ఎంఆర్ లను పర్మినెంటు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు చెప్పారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కార్మికులకు త్వరలోనే కార్డులు జారీచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు గోపాల్ వివరించారు.

LEAVE A REPLY