జీఎస్టీని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్

0
38

జూలై నుంచి అమలులోకి రానున్న వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్)ను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రూపొందిస్తామని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. జీఎస్టీ అమలులో రాష్ట్రాల హక్కులను చాలావరకు కాపాడుకోగలిగామన్న సంతృప్తి తనకు ఉందని ఆయన సచివాలయంలో గురువారం తనను కలిసిన విలేకరులతో అన్నారు.జీఎస్టీలో రాష్ర్టానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కోటిన్నర లోపు టర్నోవర్ డీలర్లు 90 శాతం రాష్ట్ర పరిధిలోకే వస్తారని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తిగా పన్నును మినహాయించడం మంచి పరిణామమన్నారు.

LEAVE A REPLY