‘జాలీ’ మంచి అబ్బాయట!

0
30

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జాలీ ఎల్‌ఎల్‌బీ-2’. ఈ చిత్రం తొలి పోస్టర్‌ను అక్షయ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘జాలీ ఎల్‌ఎల్‌బి-2’ ఫస్ట్‌లుక్‌ ఇదిగో. మంచి అబ్బాయైన జాలీని 2017 ఫిబ్రవరి 10న కలవడానికి సిద్ధంగా ఉండండి’ అని ట్వీట్‌ చేశారు. అంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు అక్షయ్‌ పరోక్షంగా చెప్పారు. ఈ పోస్టర్‌లో అక్షయ్‌ నుదుటిపై కుంకుమతో పాతకాలం స్కూటర్‌పై కూర్చుని.. భుజానికి ఓ బ్యాగు తగిలించుకుని నవ్వుతూ డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది.

సుభాష్‌ కపూర్‌ 2013లో తెరకెక్కించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ చిత్రానికి సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హుమా ఖురేషీ, అన్ను కపూర్‌, సౌరభ్‌శుక్లా, అర్షద్‌ వార్సి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here