జార్ఖండ్ ఆలయంలో భక్తుడి ఆత్మార్పణం

0
24

జార్ఖండ్‌లోని రాజ్రప్పలో గల చిన్నమస్తిక ఆలయంలో సంజయ్‌నాథ్ (35) అనే భక్తుడు గొంతుకోసుకొని ఆత్మార్పణం చేసుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో గొంతుకోసుకు న్నాడు. చిన్నమస్తిక అమ్మవారికి తల ఉండదు.

ఇక్కడ కొందరు భక్తులు చేతి వేలును కోసి అమ్మవారికి అర్పిస్తుంటారు. బీహార్‌లోని బక్సర్ మండలం బలిహార్ గ్రామానికి చెందిన సంజయ్‌నాథ్ మంగళవారం ఉద యం 6 గంటలకు ఆలయానికి వెళ్లాడు. ఆలయ పూజారులు గర్భగుడిలో అమ్మవారికి పూజచేస్తున్న సమయంలో సంజయ్ అమ్మవారికి ఎదురుగా కూర్చొని కొన్ని మంత్రాలు ఉచ్ఛరించాడు. ఆ తర్వాత తాను తెచ్చుకున్న పదునైన పొడవాటి కత్తితో గొంతు కోసుకున్నాడు. రక్తపుమడుగులో పడి ఉన్న సంజయ్‌ని గుర్తించిన భక్తులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి వచ్చేసరికే అతను చనిపోయాడని రాజ్రప్ప ఆలయ పండితుల సమితి ప్రధాన కార్యదర్శి సుభాషిశ్ పండా తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సంజయ్ భౌతికకాయాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి జేబులో కాగితం ఆధారంగా బీహార్‌లో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారమిచ్చామని పోలీస్ అధికారి అతిన్‌కుమార్ పేర్కొన్నారు. సంజయ్ తండ్రి సీఆర్పీఎఫ్‌లో కానిస్టేబుల్ అని ఆయన తెలిపారు.

LEAVE A REPLY