జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి కోర్టులో చుక్కెదురు 

0
31

సెయింట్ లూయీ: తనకు క్యాన్సర్ సోకడానికి జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడరే కారణమంటూ వ్యాజ్యం దాఖలు చేసిన మహిళకు అమెరికాలోని మిస్సోరీ రాష్ర్టానికి చెందిన సెయింట్ లూయీ కోర్టు భారీస్థాయిలో 11 కోట్ల డాలర్ల నష్టపరిహారం ఇప్పించింది. భారత కరెన్సీలో అది రూ.737 కోట్లు. దీర్ఘకాలం ఆ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్‌ను వాడటం వల్లే తనకు అండాశయాల క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ లోయీ స్లెంప్ అనే మహిళ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆమెకు అంత భారీమొత్తంలో పరిహారం ఇప్పించడం సంచలనం సృష్టిస్తున్నది. జాన్సన్ బేబీ పౌడరుతోసహా కంపెనీ తయారు చేసే పలు టాల్కం ఉత్పత్తులపై సుమారు 2400 కేసులు నడుస్తున్నాయి. శాస్త్రపరమైన ఆధారాలను ఖాతరు చేయకుండా ఈ కంపెనీలు అమెరికా మహిళల పట్ల తమ బాధ్యతలను విస్మరిస్తూనే ఉన్నాయని ఈ కేసు రుజువుచేస్తున్నదని స్లెంప్ తరఫు న్యాయవాది టెడ్ మీడోస్ వ్యాఖ్యా నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here