జాతీయ గీతాలాపనప్పుడు నిలబడని వారిపై కేసు

0
13

చెన్నై : సినిమా థియేటర్‌లో జాతీయ గీతం ఆలాపనప్పుడు నిలబడని ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు చెన్నై పోలీసులు సోమవారం తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతాలాపన రీల్‌ను ప్రదర్శించాలని ఆదేశించిన అనంతరం నమోదైన మొట్టమొదటి కేసు ఇదే. ఆదివారం చెన్నై అశోక్‌నగర్‌లోని కాశీ థియేటర్‌లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించారు. ఇద్దరు యువతులతోపాటు ఆరుగురు యువకులు లేచి నిలబడకపోగా, సెల్ఫీలు తీసుకుంటుండటంతో కొందరు వ్యక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. సినిమా విరామ సమయంలో హాలు బయట కొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను ఠాణాకు తరలించారు. జనగణమన ఆలపిస్తున్నప్పుడు నిలబడ లేదని, పైగా సెల్ఫీలు తీసుకున్నారని విజయ్‌కుమార్ అనే వ్యక్తి ఆ యువతీయువకులపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY