జాట్ల ఆందోళనల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం

0
23

హర్యానాలోని జాట్ వర్గీయులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం పార్లమెంట్ ముట్టడికి జాట్ వర్గీయులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీతో సహా హర్యానాలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో ఇవాళ రాత్రి 11.30 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు 12 మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. అవసరమైతే ఢిల్లీలో 144 సెక్షన్ విధించే అవకాశం ఉన్నది. ఢిల్లీకి వచ్చే రహదారుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానమైన రహదారులను మూసివేశారు. ఢిల్లీ, హర్యానాలో పారామిలటరీ బలగాలు భారీగా మోహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here