జాకీచాన్ యాక్షన్ ఎంటర్‌టైనర్

0
26

జాకీచాన్ కెరీర్‌లోఅత్యధిక బడ్జెట్‌తో కుంగ్‌ఫూయోగా చిత్రం తెరకెక్కింది. ఇండియన్, చైనీస్ సంస్కృతుల కలయికలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. నా కెరీర్‌లో లార్జర్ దెన్ లైఫ్‌గా నిలిచిపోతుందనే నమ్మకముంది అని తెలిపారు సోనుసూద్. జాకీచాన్ కథానాయకుడిగా నటించిన ఇండో చైనీస్ చిత్రం కుంగ్‌ఫూయోగా. సోనుసూద్, అమైరా దస్తూర్, దిశాపటాని కీలక పాత్రలను పోషించారు. స్టాన్‌లీటాంగ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని అదే పేరుతో కల్పన చిత్ర పతాకంపై నిర్మాత కోనేరు కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సోనుసూద్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. తెలుగు సినిమాలే నన్ను నటుడిగా నిలబెట్టాయి. ఇక్కడి దర్శకులు నా కోసం ఎన్నో మంచి పాత్రల్ని సృష్టించారు. కుంగ్‌ఫూయోగా సినిమా కారణంగా ఏడాదిగా తెలుగు సినిమాలకు దూరమయ్యాను. తప్పకుండా ఈ సంవత్సరం తెలుగులో రెండు సినిమాలు చేస్తాను. చైనా నుండి ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్ అయిన షాన్ జంగ్ అనే మరో ఇండో చైనీస్ సినిమాలో నటిస్తున్నానుఅని తెలిపారు. జాకీచాన్ నా అభిమాననటుడని, అధర్వణ వేదం నేపథ్యంలో ఆయనతో ఓ యాక్షన్ సినిమా చేయాలనేది తన కల అని రచయిత జె.కె. భారవి తెలిపారు. జేమ్స్‌బాండ్, డిస్నీ, జాకీచాన్ ఈ జోనర్ సినిమాలే హాలీవుడ్‌లో అత్యధిక శాతం విజయాల్ని అందుకున్నాయని సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్పన, మల్కాపురం శివకుమార్, అమైరా దస్తూర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here