జస్టిస్ దవే, జస్టిస్ సీతాపతిలకు బాధ్యతలు

0
15

జస్టిస్ లోధా సిఫారసుల అమలుతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఏ.ఆర్. దవే, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీతాపతిలను అడ్మినిస్ట్రేటర్లుగా (పరిపాలన నిర్వాహకులు) నియమిస్తూ తెలుగు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాబోయే ఆరు నెలల పాటు హెచ్‌సీఏలోని అన్ని అంశాలపై ఈ ఇద్దరికే పూర్తి అజమాయిషీ ఉంటుందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఎన్నుకోబడే హెచ్‌సీఏ కార్యవర్గంతో పాటు బీసీసీఐ పరిపాలన కమిటీ (సీవోఏ) ఈ అడ్మినిస్ట్రేటర్లకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ, ఫ్రాంచైజీ చెల్లించే డబ్బులను హెచ్‌సీఏ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి, పర్యవేక్షకుల అనుమతితోనే ఖర్చు చేయాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here